Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కులగోత్రాలు మలమూత్రాలు/ ఒకలాంటివే / అలాంటివి విసర్జిస్తేనే ఆరోగ్యం/ ఒకటి దేహానికి, మరొకటి దేశానికి' అంటాడో కవి. సాంకేతకంగా మానవుడు ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ప్రత్యేకంగా మన దేశంలో కులమతాలు అడ్డు గోడల్లా నిలుస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు అయిందని ఆజాదీ అమృతోత్సవాలను జరుపుతున్నారు. కానీ, డెబ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతంలో ఇప్పటికీ చాలా ఊర్లలో కఁల బహిష్కరణ ఓ కట్టుబాటుగా సాగిపోతోంది. ఊరి కట్టుబాట్లు, కులపంచాయతీలు, వీడిసీ(గ్రామాభివృద్ధి కమిటీ) వ్యవస్థ గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో చోటుచేసుకఁనే హింసాత్మక సంఘటనలు సరేసరి. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇదేనా? సాయుధ పోరాట మూలాలతో చైతన్యవంతమైన తెలంగాణలో, గడిచిన వారంలో కఁటుంబాల వెలి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి.
పుట్టుకే ఆధిపత్యానికి అర్హతైన వ్యక్తులకు ప్రజాస్వామ్యానికి మించిన శత్రువు లేదు. తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న తమ గ్రామాధిపత్యానికి ఎన్నికల వ్యవస్థ నుంచి, మరీ ముఖ్యంగా ఎన్నికల రిజర్వేషన్ల నుంచీ తప్పించుకునేందుకు ఆధిపత్య శక్తులు అనేక అడ్డదారులను ఆశ్రయిస్తున్నాయి. నిన్నటి వరకూ ' నీ బాంచన్ కాల్మొక్కుత దొరా ' అన్న జనాలు, నేడు ప్రజా ప్రతినిధులై తమ కండ్ల ముందే కుర్చీలెక్కి కూర్చోవడాన్ని సహించలేకపోతున్నాయి. ఆధిపత్యం తమ చేజారిపోకుండా ఉండేందుకు 'గ్రామాభివద్ధి కమిటీ'లను రక్షణ కవచంగా ఉపయోగించుకుంటున్నారు. అణగారిన కులాలను , ముఖ్యంగా దళితులను వీడీసీల ద్వారా రాచి రంపాన పెడుతున్నారు. ఈ ఆధునిక సమాజంలో అధికారం అండలేకుండా ఇంతటి అన్యాయమైన శిక్షలు సాటి మనుషులపై విధించడం అసాధ్యం.
తాజాగా నిజామాబాద్, జగిత్యాలలలో వెలుగుచూసిన ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. వీడీసీల ముసుగులోని పెత్తందారులు.. తమ చెప్పుచేతల్లో లేనివారిపై బహిష్కరణ వేటు వేస్తూ, ఊర్లో కనీసం నిత్యావసరాలు సైతం అందకుండా చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని వేల్పూర్ మండలం వాడి గ్రామ వీడీసీ ఓ యాదవ కఁటుంబాన్ని బహిష్కరించింది. ప్రశ్నించిన సంఘానికి సైతం రూ.3 లక్షల జరిమానా విధించింది. జగిత్యాల జిల్లాలోని బావాజీ పల్లెలో కూడా ఓ కుటుంబాన్ని గ్రామపెద్దలు కులం నుంచి బహిష్కరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో బాధితుల ఇంటిపై దాడి చేశారు. అదే జిల్లా మోతే గ్రామంలో ఓ భూ పంచాయితీ వివాదంలో మరో కుటుంబాన్ని కఁల పెద్దలు గ్రామం నుంచి వెలివేశారు. దీంతో బాధిత కఁటుంబం పోలీసులకు ఆశ్రయించి న్యాయంకోసం వేడుకుంటున్నారు.
మనుషులందరినీ సమానులుగా, సాటివారుగా చూసే విశాల దష్టి దేశంలో ఎన్నడూ లేదు. కుల వ్యవస్థ దేశ ప్రజల మధ్య దుర్భేద్యమైన గోడలు నిర్మించింది. ''కంచం పొత్తు, మంచం పొత్తు''ను నిషేధించింది. కొన్ని కులాలను వెలి వేసి అంటరాఁతనమనే దుర్మార్గపు ఆచారాన్ని నెలకొల్పింది. ఈవిధమైన సామాజిక అగాధాలు ఏనాటి నుంచో ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్ లలోనే కాదు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోనూ.. అగ్ర కులాలవారు పరువు పేరుతో ప్రేమించి పెండ్లి చేసుకున్నవారిని హత్యలు చేస్తున్నారు. మంథినిలో మధుకర్, భువనగిరిలో స్వాతి, నరేష్, మిర్యాలగూడలో ప్రణయ్ ల హత్యోదంతాలు ఇంకా మన కండ్ల ముందు నుంచి చెదిరిపోలేదు.
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వాతంత్య్ర ఫలాలు అందకపోవడం వల్ల ఆర్థికంగా బలహీనపడటమే కాక సామాజిక చైతన్యాన్ని పెంచుకోలేకపోయారు. దేశంలో ఏదోఒక్కచోట కులపరంగా, మతపరంగా దాడులు, అణచివేత ఎందుకు కొనసాగుతూనే ఉన్నాయి? రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పాలకఁలు కఁలాల చుట్టూ, మతాల చుట్టూ తిరుగుతుంటే ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ శక్తులు విబృంభిస్తూనే ఉంటాయి. ఈ విష సంస్కతిపై ఏనాడో చట్టపరంగా నియంత్రించాల్సిన ప్రభుత్వాలు, అందుకు ఎప్పుడు పూనుకుంటాయనేది ఇప్పుడు సమాజాన్ని వేదిస్తున్న ప్రశ్న.
నేడు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఉదంతాలన్నిటినీ చూస్తుంటే నిజంగా మనం ఆధునిక ప్రపంచంలోనే ఉన్నామా..? లేక మధ్యయుగాల్లో ఉన్నామా అనే అనుమానం కలుగక మానదు. కుల దురహంకార హత్యలు, కుల బహిష్కరణలు వంటి ఈ అకత్యాలకు బాధ్యత ఎవరిది ? ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులదే కాదు. ఈ వ్యవస్థది. నేటి ఆధునిక యుగంలో కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ సనాతన భావజాలాన్ని పెంచి పోషిస్తున్న పాలకవర్గాలది. ప్రభుత్వాలది కూడాను. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మత దురహంకారం, కఁల దురహంకారం మరింత పెచ్చరిల్లుతున్నాయి. భావితరాల భవిష్యత్తు మీద చావు గీతలు గీస్తున్నాయి. అందుకే ఆంబేద్కర్ 'కులం పునాదుల మీద ఒక జాతిని కాని, నీతిని కాని నిర్మించలేం' అని అంటారు. కుటుంబాలకు కుటుంబాలను ఊరి నుంచి వెలి వేస్తున్న కులమెంత క్రూరమైనదో కదా..!