Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవి మందులు కావు. వాగ్దానాలు. పైగా పాలకుల వాగ్దానాలు. వాటికి ఎక్స్పైరీ డేట్లుండవ్. హావభావాల్తో రక్తి కట్టించగలిగిన శక్తి ఉంటే ఎన్నిసార్లైనా చేయొచ్చని, ఎన్ని సంవత్సరాలైనా చేయొచ్చని మోడీగారి భ్రమ! సంఫ్‌ుపరివార్ నేతలకు. మన ప్రజల 'జ్ఞాపక శక్తి' మీద అపార నమ్మకమున్నట్టుంది. ఎక్స్‌పైరీడేట్ అయిపోయిన వాగ్దానాలను దొర్లిస్తూనే ఉన్నారు. గతంలో ఎన్నికలపుడే ఏలికల వాగ్దానాల జడివాన కురిసేది. ఇపుడు మోడీ మహాశయుడు సందర్భాలుÛ సృష్టించుకుని మరీ వర్షిస్తున్నాడు.
సాధారణంగా ''వేలనే' అందరూ అంచానా కట్టలేరు. లక్షలు, కోట్లయితే అదీ కోటి కోట్లయితే సామాన్యుల ఊహకందని విషయం. ఆకాశంలో నక్షత్రాలెన్నంటే ఏమి చెప్పగలం? పిల్లలైతే బోలెడన్ని అంటారు. పెద్దలైతే అసంఖ్యాకమంటారు. ఈ కోటి కోట్లుకూడా ఆబాపతుదే! 2019 ఆగస్టు 15కి చేసిన కోటి కోట్ల వాగ్దానాన్ని 2020లోనూ చేసి 2021 పంద్రాగస్టుకి మళ్ళీ చేస్తే, అన్న నోటినీ, చేసిన వ్యక్తినీ ఏమనుకోవాలి? ఈ కోటి కోట్ల రూపాయలు మౌలిక సదు పాయాల కోసం కుమ్మరి స్తారట! దాంతో 'లక్షల్లో' ఉద్యోగాలొస్తాయట! మన యువత ఏరుకోవచ్చట! 2014లో బాస చేసిన ''ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాల ఊసు'' జనం స్మృతి పథం నుంచి చెరిగిపోయుంటుందని సంఫ్‌ుపరివార్ నేతలకు నమ్మకం. 2019లోనే కొన్నైనా విత్తనాలు విసిరేసి ఉంటే మొలకలైనా కన్పడేవి. రామకోటి రాసినట్టు, సహస్రనామార్చన చేసినట్టు కోటి కోట్ల గురించి పారాయణం చేస్తే ఏలిన వారాసించినట్టు ఓట్లు కూడా రాలవు.
పనిలో పనిగా ప్రజల' కార్యంతో పాటు 'స్వ' కార్యం కూడా చూసుకోవడం లేదా చేసుకోవడం ఈ అగ్ర స్వయం సేవకుడికి అలవాటు. 2022లో లక్నో కోట నిలబెట్టుకోగలిగితే 2024లో ఢిల్లీ సింహాసనం దక్కినట్లేననేది సంఫ్‌ుపరివార్ ఆశ. ఆలోచన. జమ్మిచెట్టు మీదున్న ఆయుధాలు దించారు. పంద్రాగస్టుకు మించిన సందర్భమేముంటుంది? ఆగస్టు 14ను 'దేశ విభజన ఘాతుకాలు గుర్తు చేసుకునే దినం' అని మోడీ ప్రకటించగానే గృహ మంత్రాలయం ఫరానా కూడా విడుదల చేసేసింది. తగిలిన గాయం మందు రాసినా కాలక్రమంలో మానిపోతుందనేది కామన్సెన్స్ విషయం. మందు రాయకుండా దాన్ని నిరంతరం కెలుకుతోంది మోడీ సర్కార్. (వాజ్పారుగారన్నట్టు 'రాజధర్మం' మరిచిపోతే '2002 గుజరాత్' గాయాల్లాంటివి పునరావృతం అవుతాయి తప్ప లేకుంటే విభజన గాయాలు మానిపోతాయి). ప్రజల మధ్య ఐక్యత, ముఖ్యంగా హిందూ ముస్లిం ఐక్యత ఉంటే సంఫ్‌ుపరివార్ పప్పులుడకవు. అందుకే దాన్ని రావణకాష్టం చేస్తోంది.
ఆగస్టు15 ఆనవాళ్ళను, జాతీయోద్యమ అడుగుజాడల్ని ప్రజల మనసుల నుంచి తుడిపేయడానికి పరివార్ నేతల కొంగ్రొత్త ఎత్తుగడ ఈ ''విభజన ఘాతుకాలను గుర్తు చేసుకునే దినం''. మన దేశంలో ముస్లింలీగ్ ఏర్పడింది 1907లో. 1911లో ఆలిండియా హిందూ మహాసభ ఏర్పడింది. హిందువులు, ముస్లింలు రెండు జాతులనే సిద్ధాంతం 1923లో వి.డి. సావర్కర్ ప్రతిపాదించాడు. దీన్నే 1940ల్లో జిన్నా పట్టుకున్నాడు. భారత దేశం రెండు ముక్కలవ్వాలన్న ప్రతిపాదన ఆ విధంగా రూపుదిద్దుకుంది.
సావర్కర్ 1923 ఏప్రిల్ 11న జరిగిన హిందూ మహాసభ అధ్యక్షోపన్యాసం లో రెండు జాతుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దేశ విభజనకి రెండు మతోన్మాదాల బాధ్యతుందని తెలిపేవే పై వాక్యాలు. నేడు పాకిస్థాన్, భారత దేశాలు ఒక వాస్తవం. ఆ సత్యాన్ని అరెస్సెస్ మెగా ప్రాజెక్టు 'అఖండ భారత్'తో చెరిపివేయాలనేది మోడీ ప్రవచనాలకి అర్థం. ఆ రకంగా భిన్న మతాల మధ్య ముఖ్యంగా హిందువులు, ముస్లింలు మధ్య శాశ్వత ఘర్షణ సృష్టించాలని అప్పుడే తన రాజకీయ పబ్బం గడుపుకోవచ్చని సంఫ్‌ుపరివార్ ప్రణాళిక. ఆ రకంగా దేశ,విదేశ కార్పొరేట్లు తమ దోపిడీని యదేచ్ఛగా కొనసాగించుకోగలుగుతారని వారి ఆకాంక్ష. 2014లో మోడీ ప్రతిష్టాపన జరిగింది దీనికోసమే. కింది వివరాలు దీన్నే స్పష్టం చేస్తాయి. గృహ మంత్రిత్వ శాఖ లెక్క ప్రకారం 2013లో లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో 823 మత ఘర్షణలు జరిగాయి. ఒక్క ఉత్తర ప్రదేశ్‌లోనే 247 జరిగాయి. మొత్తం 80 లోక్‌సభ సీట్లలో బీజేపీకి 71 సీట్లు, దేశంలో అధికారం ప్రసాదించాయి. 2014 ఏప్రిల్, జూన్ మాసాల్లో 149 మత ఘర్షణలు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్ర యూపీల్లో జరిగాయి. నెత్తురు రుచి మరిగిన బెబ్బులి 2022 -2024 ముందు ఆగుతుందా? ఆగేమ్ ప్లాన్‌లో అంతర్భాగమే మోడీ స్వాతంత్రదినోత్సవ ఉపన్యాసం.
నేడు వెల్లివిరియాల్సింది భారతీయత. ''మతము వేరైతేనేమోయి మనసులు వొకటై మనుషులుంటే జాతి యన్నది లేచి పెరిగీలోకమున రాణించునోయి.'' అని గురజాడ చెప్పింది ఆచరించాలని పరివార్ నేతలకు ఎవరు ఉద్భోధించాలి 1618 భాషలు 6400 కులాలు, ఉపకులాలు, ఆరు ప్రధాన మతాలున్న దేశం మనది. ఇంత వైవిధ్యాన్ని నిలబెట్టేది, గత 75 ఏండ్లుగా నిలబెట్టింది ఈ భారతీయతే. దాన్ని ధ్వంసం చేయడానికి చేసే ప్రయత్నాలను ధ్వంసం చేయడమే నేటి కర్తవ్యం.