Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిన్నారం
మండల కేంద్రంలో జిన్నారం లో గల సర్వే నంబర్ 1కి చెందిన 421 ఎకరాల భూములకు సంబంధించి రైతులకు న్యాయం చేయాలని సోమవారం నాడు జిన్నారం తాసిల్దార్ దశరథ్కు జిన్నారం రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఏండ్ల తరబడిగా తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములో తమకు తెలియకుండానే సదరు భూముల్లో చదును చేసే కార్యక్ర మాలు నిర్వహిస్తే సహించేది లేదన్నారు. రైతులకు తెలియ కుండా పనులు చేపట్టడం ప్రభుత్వం, ఇస్తామన్న మూడు ఎకరాల భూములు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆ భూముల్లో చదును చేసే పనులను వెంటనే ఆపాలని తాసిల్దార్ కు విజ్ఞప్తి చేశారు.తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కార్యక్రమాలకు వెనుకాడేది లేదన్నారు. జిన్నారం మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్,రైతులు దోమడుగు రమేష్ నీలం రాము, దుర్గయ్య మేదరి రాము, దశరథ, కొండకల్ల ఎల్లమ్మ, వెంకటేష్, యాదగిరి సత్యమ్మ, బిక్షపతి, యాదగిరి, నరసింహులు స్వామి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.