Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
నవతెలంగాణ-మర్కుక్
గొల్ల కుర్మల పట్ల నిబద్ధత కలిగిన ప్రజా నాయకుడు సీఎం కేసీఆర్ అని అటవీశాఖ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న కుర్మ సంఘం భవనానికి మర్కుక్ ఎంపీపీ తాండ పాండుగౌడ్, జెడ్పీటీసీ యెంబరి మంగమ్మ రాంచంద్రం యాదవ్, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, నాచారం ఆలయ ఛైర్మెన్ హరిపంతులుతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ ప్రభుత్వం సిఎం కెసిఆర్ నేతృత్వంలో సబండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాద్యాక్షులు సిలివేరి కృష్టాగౌడ్, వార్డు సభ్యులు గణేష్,మాజీ ఎంపీటీసీ రాజేష్ గౌడ్, ప్యాక్స్ డైరెక్టర్ తలకొక్కుల రాములు, ఎస్ఎంసీ ఛైర్మెన్ చిన్న బోయిని మల్లేష్ , సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, గ్రామశాఖ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జుట్టు సుధాకర్,బాలస్వామి, మేర వెంకటేష్, చెక్కలి రాములు, చంద్రం, చిన్న బోయిని లక్ష్మణ్ , మేకల శ్రీనివాస్, కుర్మ సంఘం నాయకులు బొమ్మ యాదగిరి , బొమ్మ సాయిలు, బొమ్మ బీరయ్య ,ఒగ్గు లక్ష్మయ్య ,కొమురయ్య, స్వామి ,కుమార్ ,ప్రభాకర్, అశోక్, కనకరాజు ,మల్లయ్య ,సత్తయ్య ,స్వామి కృష్ణ ,తదితరులున్నారు.