Authorization
Thu April 03, 2025 07:23:56 am
నవతెలంగాణ -మద్దూరు
శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాష్‌ను నియమించినందుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా జనగామ జిల్లా కేంద్రానికి బండ ప్రకాష్ రావడంతో ఆయనకు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఉమ్మడి మద్దూరు దూల్మిట్ట మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు చొప్పరి సాగర్ ముదిరాజ్ స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో గాగిల్లాపూర్ సర్పంచ్ బొల్లు కృష్ణవేణి చంద్రమౌళి అన్ని గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.