Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దూరు
మండలంలోని నర్సాయపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వయం సపరిపాలనా దినోత్సవం నిర్వహిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యా ర్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేశం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డిలు. ఉత్తమ ప్రతిభ కనబ రచిన విద్యార్ధి ఉపాధ్యాయులు ముస్త్యాల భావన, ముస్త్యాల శిరీష, (ఉన్నత)వర్షిత, ప్రవీణ (ప్రాథమిక )లకు బహుమతులు అందించారు. జిల్లా విద్యాశాఖాధికారిగా టి. అనిల్, ప్రధానోపాధ్యాయులుగా సి. హెచ్. సిద్ధార్థ, హర్షవర్ధన్ రెడ్డి లు. మండ ల విద్యాశాఖాధికారిగా వర్షిణి , అటెండర్ గా అరవింద్ పీఈటీ గా వినీల్ వ్యవహ రించారు. శిరీష ,కావ్య ,భార్గవి ,పర్శరాములు , సతీశ్ తదితరులు ఉపాధ్యా యులుగా వ్యవహరించారు. ఉపాధ్యాయ బృందం ఆంజనేయులు, నర్సింహులు, నాగేందర్ , లింగయ్య, కాంతికృష్ణ , అనిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.