Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిరుదొడ్డి
దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రధాని కావాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కాజీప ూర్ గ్రామంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ గ్రామ కమిటీ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తలపెట్టిన సర్వజన సంకల్ప పాదయాత్రను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కాజీపూర్ గ్రామం నుండి యాదాద్రి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని బీఆర్ఎస్ కార్యకర్తలు తలపెట్టిన సంకల్ప పాదయాత్ర హర్షనీయమ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్, దేశ ప్రధాని అయితే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. నిత్యావసర ధరలు పెంచి సామాన్యుడిపై భారమోపుతున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. మిరుదొడ్డి వ్యవసాయ కమిటీ చైర్మెన్ వల్లాల సత్యనారాయణ, బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి, పీఏసీఎస్ దుబ్బాక చైర్మెన్ కైలాస్ మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దుబ్బరాజం, బోయ శ్రీనివాస్, నాగరాజు, చిరంజీవి, పెరిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.