Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సదాశివాపేట
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సంగ మేశ్వర మందిరంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహౌ త్సవం కన్నుల పండుగ్గా జరిగింది. బ్రహ్మశ్రీ మాడుగుల సర్వోత్తమ శర్మ ఆధ్వర్యంలో కౌన్సిలర్ ఆకుల శివకుమార్ మంజుల దంపతులు, బుగ్గారపు శ్రీనివాస్ గుప్తా శ్రీమతి రాజేశ్వరి దంపతులు శివపార్వతుల కళ్యాణం జరిపించారు. అనంతరం భజన భక్త బృందం, పిల్లోడి రాచన్న గురుస్వామి, శివస్వాముల బృందం డప్పు వాయిద్యాలు, భజన కార్యక్ర మం ద్వారా శివనామ కీర్తనలతో బాణాసంచా పేల్చుతూ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాల పల్లకి సేవ కార్య కమాన్ని చేపట్టారు. భక్తులందరికీ మారేపల్లి వెంకటేశంగౌడ్ సౌజన్యంతో లడ్డు ప్రసాద వితరణ చేశారు.
ఈ శివరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆల యంలో ఏర్పాటు చేసిన నాట్యశిల్ప అకాడమీ భాగ్యరేఖ ఆధ్వర్యంలో చేపట్టిన కూచిపూడి నృత్యాలు, కార్యక్రమా లను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఆలయ అభివృద్ధిలో భాగంగా తన వంతుగా కళ్యాణ మండప నిర్మాణం కోసం రూ.50 లక్షలు మంజూరు చేయి స్తానని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ బుక్ స్టాల్ సంగారెడ్డి వారిచే చిన్నారులకు బహుమతులు అంద జేశారు. కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ నాగరాజు గౌడ్, నాగేష్, కంది కృష్ణ, చిరంజీవి, రాఘవేందర్ పాల్గొన్నారు.