Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకప్పుడు నీళ్లకోసం కరువు.. నేడు వేసవిలోనూ అలుగులు
- మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-తొగుట
ఒకప్పుడు ఈ ప్రాంతం గుక్కెడు నీళ్లకోసం ఎంతో ఇబ్బందులు పడేది.. అలాంటిది కాళేశ్వరం ద్వారా నదినే మళ్లించి ఎండకాలంలో కూడా అలుగులు పారేలా చేసిన సీఎం కేసీఆర్ నిజంగా కారణజన్ముడేనని ఆర్థిక, వైద్య ఆర గ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి దుబ్బా క కెనాల్‌కు శుక్రవారం మంత్రి నీటిని విడుదల చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఒకనాడు దుబ్బాక ప్రాంతంలో గుక్కెడు నీళ్ల కోసం ఎంతో ఇబ్బందులు పడేవారన్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కాళేశ్వరం జలాలు నేడు దుబ్బాకలో జలాజలా పారుతున్నా యన్నారు. దుబ్బాక కెనాల్ ద్వారా తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, సిద్దిపేట, ముస్తాబాద్, గంబిరావ్పేట వరకు దాదా పు 91 చెరువులకు నీళ్లు నింపుతున్నామన్నారు. ప్యాకేజీ 12 కింద 1లక్ష10 వేల ఎకరాలకు ఆయకట్టు ఉందని తెలి పారు. ఈ కాలువ కింద దాదాపు 257 చెరువులకు ఉన్నా యన్నారు. కానీ ఇప్పుడు నీళ్లు ఇచ్చేది 91 చెరువులకు మాత్ర మేనని.. అందరూ సహకరిస్తే 257 చెరువులకు నీళ్లు తీసుక వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. అందు కోసం స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక నాయకులు చొరవ తీసుకొని రైతు సోదరులతో మాట్లాడి భూములిస్తే లక్షా10 వేల ఎకరాలకు నీళ్లు తీసుకుపోయేందుకు వీలు పడుతుందన్నారు.గంట తర్వాత దుబ్బాక కెనాల్ నుండి రామయంపేట కెనాల్‌కు ఎంపీ నీళ్లు వదులుతారని పేర్కొ న్నారు. రైతుల పంటలు ఎండోద్దని రోజుకు 30 కోట్ల కరం ట్ కొని రైతులకు బావి కాడా, బోరు కాడా ఉచితంగా నాణ్య మైన కరెంట్ ఇస్తున్నామన్నారు. ఉచిత కరంట్ మీద తెలం గాణ ప్రభుత్వం దాదాపు 50 వేల కోట్లు రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టిం దన్నారు. రైతు బంధు కోసం రూ.65 వేల కోట్లు, రైతు బీమా కోసం 5300 కోట్లు, చెక్కు డ్యాముల నిర్మా ణం కోసం 2 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాధాకృష్ణ రోజా శర్మ, ఈ ఎన్‌సి హరే రాం, ఇరిగే షన్ అధికారులు, పిఏసీఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరిక్రిష్ణ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రైతు బంధు మండ ల అధ్యక్షుడు బోధనం కనకయ్య, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సిరినేని గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్‌లు గంగని గళ్ళ మల్ల య్య, తోయేటి ఎల్ల య్య, బొడ్డు నర్సింలు,ఎంపీటీసీ లు వేల్పుల స్వామి, కొమ్ము శరత్,సర్పంచ్‌లు, తాజా, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.