Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏలకు సంఘీభావం తెలిపిన కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ సంఘాలు
నవతెలంగాణ-నారాయణఖేడ్
అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ లకు పే స్కేల్ అమలుపరుస్తానని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ సంఘాలు డిమాండ్ చేశాయి. హామీల అమలు కోసం గత 61 రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు ఆయా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా కేవీపీఎస్, ఎస్ఎ ఫ్ఐ నాయకులు కోటరీ నర్సింలు, ప్రవీణ్ కుమార్, రెవెన్యూ సహాయకులు తదితరులు మాట్లాడుతూ.. పే స్కేల్ అమలు పరిచే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదన్నారు. వీఆర్ఏ లకు పే స్కేల్ అమలుతో పాటు అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇస్తూ రిటైర్మైంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మం లో కేవీపీఎస్ జిల్లా కమిటి సభ్యులు నర్సాపూర్ శంకర్, ఎస్ ఎఫ్ఐ డివిజన్ నాయకులు గౌతం తదితరులు పాల్గొన్నారు.