Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెన్షన్ రూ.10 వేలకు పెంచాలి
- కలెక్టరేట్ ఎదుట ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో ధర్నా
- సమస్యల పరిష్కారానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ హామీ
నవతెలంగాణ-సంగారెడ్డి
అర్హులైన వికలాంగులకు ప్రత్యేక రేషన్ కార్డు మంజూరు చేయాలని, పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఐదుశాతం వికలాంగులకు కేటాయించకుంటే ఉద్యమ ఉధతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 శాతం వైకల్యం కలిగిన వికలాంగులందరికీ ప్రత్యేక రేషన్ కార్డు జారీ చేయాలని.. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 13ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఐదుశాతం కేటాయిస్తామని జారీ చేసిన జీవోను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వైకల్యం తీవ్రతను బట్టి బ్యాటరీ వాహనాలని వికలాంగులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 80శాతం వైకల్యం నిబంధన పెట్టడం ద్వారా అర్హులైన వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ లో ఐదు శాతం వికలాంగుల కేటాయించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన వికలాంగుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఎందుకు జరప నిర్వహించడం లేదని ప్రశ్నించారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 6 ఏండ్లు గడుస్తున్నా పటిష్టంగా ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ప్రతీనెలా పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ. మాణిక్యం, జిల్లా కార్యదర్శి ఏం బశ్వరజ్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. పేదలకు ఇచ్చే పథకాలన్నీ ఉచితలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. వికలాంగుల పెన్షన్ను రూ.10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని అదనపు కలెక్టర్ వీరారెడ్డి హామీ ఇచ్చారు. ధర్నాలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు బుక్క ఇస్మాయిల్, జయలక్ష్మి, నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు దత్తు, గౌరవ అధ్యక్షులు ప్రకాష్ రావు, జిల్లా నాయకులు లక్ష్మణ్, ఫర్జానా, నారాయణఖేడ్ మండల అధ్యక్షురాలు లక్ష్మి, మండల అధ్యక్షులు సంగమేశ్వర్, కంగ్టి మండల అధ్యక్షులు రాజు, జిన్నారం మండల అధ్యక్షులు కష్ణ, కొండాపూర్ మండల నాయకులు వీరేషం, సదాశిపేట మండలం నాయకులు కిష్టయ్య, ఆందోల్ మండల నాయకులు రమాదేవి, సంగారెడ్డి మండల నాయకులు వెంకటేశం పాల్గొన్నారు.