Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ల ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ-సంగారెడ్డి, సిద్దిపేట అర్బన్
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అడ్డూఅదుపు లేకుండా ధరలు పెంచుతూ పేదలపై భారాల వేయటమే కాకుండా విపరీతమైన పన్నులు వసూలు చేస్తూ పేదల నడ్డీ విరుస్తూ... పెద్దలకు మాత్రం అడ్డగోలు రాయితీలు ప్రకటి స్తున్నదని సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త నిరసనలో భాగంగా శనివారం సిద్దిపేట, సంగారెడ్డి కలెక్టరేట్ల ఎదుట సీపీఐ(ఎం) నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్, సిద్దిపేట కలెక్టరేట్ల ఎదుట పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాముని గోపాలస్వామిలు నిరసనలో పాల్గొని మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, లేకుంటే మోడీ ప్రభుత్వం గద్దె దిగాలన్నారు. పేదలపై పన్నులు విధిస్తూ పెద్దలకు మాత్రం రాయితీలు కల్పిస్తున్నదని విమర్శించారు. రెండేండ్లుగా కరోనా నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిం దన్నారు. సామాన్య, వ్యవసాయ, ఉపాధి కూలీలు, సరైన ఉపాధి లేక, పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతు న్నారన్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ధరలు పెరగడంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్న పరిస్థితి మరింత దుర్భరంగా తయారయిందన్నారు. కార్మికులకు కనీస వేత నాలు అమలుకాక కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్యాకింగ్ ఆహార పదారా ్థలపై జీఎస్టీని ఐదుశాతం నుంచి 12 శాతం, 15 శాతంపెంచిందన్నారు. 2014లో రూ.450 ఉన్న వంట గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1185కి చేరిందన్నారు. ధరలకు పెరుగుదలకు కారణమైన జీఎస్టీని రద్దు చేసి, గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించాలన్నారు. ఎన్నికల సమయంలో కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అనేక ఊకదంపుడు ఉపన్యా సాలిచ్చిన కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఏం సమాధానం చెబుతుందన్నారు. ప్రధాన రంగాలైన విద్య, వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రభుత్వ రంగా న్ని నిర్వీర్యం చేస్తున్నదన్నారు. ఇలాంటి ప్రభుత్వాల పరిపా లన కొనసాగితే ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారని దీన్ని ప్రజానీకం ముక్తకంఠంతో వ్యతిరేకించా లని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్‌కు, కలెక్టరేట్లో విన తిపత్రాలు అందజేశారు.సంగారెడ్డిలో పార్టీ జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు జి. సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు బి. యాద వ రెడ్డి, ఏం.నర్సింహులు, ఎం.యాదగిరి, నాయ కులు అశోక్, నరసింహారెడ్డి, కష్ణ, శివ, శోభ, మరియమ్మ, బాల్‌రా జ్, మహేష్, ప్రవీణ్, సిద్దిపేటలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్, జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్, అమ్ముల బాల్ నర్సయ్య, సింగిరెడ్డి నవీన, జిల్లా నాయకురాలు జాలిగపు శిరీష, మేక ఎల్లయ్య, శ్రీని వాస్,మల్లేశం, రవీందర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ : అమీన్ పూర్ మండల కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం), సీఐటీయూ, మహిళా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాయిని నర్సింహారెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల మూలంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇతర నిత్యవసర సరుక ుల ధరలు పెద్ద ఎత్తున పెరిగాయని విమర్శించారు. కార్మిక ులకు కనీస వేతనాలు, యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నదని అన్నారు. 14 రకాల ఆహార పదార్థాలను రేషన్ షాపుల ద్వారా ప్రజల కు అందించాలని, కార్మికులకు కనీస వేతనం 26 రూపా యలకు పెంచాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిం చాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కేంద్ర ప్రభు త్వానికి ఆయన డిమాండ్ చేశారు. పార్టీ అమీన్పూర్ మండ ల నాయకులు జార్జ్, శ్రీనివాస్ రెడ్డి, వీరస్వామి, జిలాని, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సునీత, లలిత, సీఐట ీయూ నాయకులు శ్రీధర్, మణిరాజు పాల్గొన్నారు.
నారాయణఖేడ్ : ఖేడ్ ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమెల మాణిక్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్యులపై భారాలు వేస్తూ.. కార్పొరేట్, సంపన్నులకు వరాలు కురిపిస్తున్నదన్నారు. దేశ సంపదను అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్లకు దోచిపెడుతున్నదన్నారు. దేశం బాగుపడాలంటే కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా ప్రయోజన విధానాలే ప్రత్యామ్నాయమన్నారు. మోడీ ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాల పిలుపునిచ్చారు. పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి చిరంజీవి, నాయకులు కోటారి నరసిం హులు,మోసప్ప,సంజీవ్, రాజ్‌కుమార్, రమేష్ పాల్గొన్నారు.
జహీరాబాద్ : జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) నాయకులు మహిపాల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయనతో పాటు నాయకులు సలీమ్ ఉద్దీన్ బక్కన్న, తిరుపతి, బీడీ మూర్తి,రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు : సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పటాన్చెరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం తహసిల్దార్ మహిపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ ఏరియా కార్యదర్శి నర్సింహారెడ్డి మాట్లాడారు. పార్టీ నాయకులు బి నాగేశ్వర రావు, కృష్ణ,అర్జున్,రవి,వరుణ్ ఇతరులు పాల్గొన్నారు.
కొండాపూర్ : మండల కేంద్రంలో జరిగిన నిరసనలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కే. రాజయ్య, వి. రామ చందర్ పాల్గొని మాట్లాడారు. పార్టీ మండల కమిటీ సభ్యులు వెంకయ్య, సంజీవులు, గోపాలు, నర్సింలు, శ్రీను, కమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జోగిపేట : జోగిపేట తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి. విద్యాసాగర్ పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ ఆపాలన్నారు. నా యకులు రాములు, భాష,హరి,రాజు, మల్లయ్య పాల్గొన్నారు.