Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతే బలం.. బలగం
- సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీబీజీ
- వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయికి..
- బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే ఆకాంక్ష
- చిట్కుల్ ఏకగ్రీవ సర్పంచ్‌గా ప్రజాసేవ
- సొంతఖర్చులతో ఐలమ్మ 12 అడుగుల కాంస్య విగ్రహా ఏర్పాటు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయప్రతినిధి, పటాన్చెరు
నీలం మధు కుటుంబం, జీవిత విశేశాలు
కడు పేదరికంలో పుట్టారు. ఆస్తిపాస్తుల్లేని అమ్మ నాన్నలు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల రిత్య హైస్కూ ల్ చదువులకే పరిమితమయ్యారు. అయినా సరె పది మందికి ఇతోదికంగా సాయం చేసే మానవతా వాదిగా ఎదిగారు. అమ్మానానల పేరిట పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. యువకుడుగా పది కోసం ఆలోచించిన మధు నలుగుర్ని కలుపుకుని ఏదో చేయాలనే తపనతో యువతను పోగేయడం మొదలుపెట్టాడు. ఆ యువతే ఆయనకు బల ం...బలగంగా ముందుకు నడుపుతోంది. పటాన్చెరు మండ లంలోని చిట్కుల్ గ్రామమే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆపద్భాం దవులుగా గుర్తింపు పొందారు. ఏమీలేని స్థాయి ఉంచి పది మందికి సాయపడడం, చావులు, పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్య లేవైనా సరె మధన్నగీ ఆపదుందంటె వెంటనే సాయం చేయడమనేది ఓ వృత్తిగా పెట్టుకున్నారు. చిన్నతనంలో తానెదుర్కొన్న పేదరిక సమస్య బాధేంటో తెలిసిన వ్యక్తిగా అందరి నోటిలో నాలుక మాదిరి మెసుకుంటూ సహాయ సహాకారా లందిస్తున్నారు.
వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయికి
గ్రామంలో యువజన నాయకుడుగా ఎడిగిన నీలం మధు తొలుత 2006లో చిట్కుల్ వార్డు మెంబర్‌గా గెలుపొందారు. వార్డు సమస్యల్ని పరిష్కరించడం, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడంతో మరో సారి కూడా గ్రామ పంచాయతీ మెంబర్‌గా గెలిచారు. వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అదే సమయంలో తన తల్లి కూడా వార్డు సభ్యురాలుగా గెలిచారు. కొద్ది నెలలకే ఎంపీటీసీ ఎన్నికలు రావడంతో వార్డు సభ్యురాలుగా తల్లి చేత రాజీనామా చేయించి 2014లో ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. అంటె జనంలో నీలం మధుకు ఉన్న ఆధరణ ఏమిటో అర్థమవుతోంది. ఊరంతా మెచ్చిన నాయకుడుగా పేరు పొందిన మధు ముదిరాజ్ గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీయే లేకుండా చిట్కుల్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. గ్రామంలో వైకుంఠదామం, డంపింగ్ యార్డు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం ఇలా కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు, కళ్యాణ లక్ష్మీ, సాదీముబారక్, రైతు బంధు వంటి పథకాలను అర్హులైన వారందరకీ అందించేందుకు చొరవ చూపుతున్నారు. టీఆర్ఎస్లో చేరిన మధు ముదిరాజ్ రాష్ట్ర నాయకుడుగా కొనసాగుతున్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలు
చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పేరు సామాజిక కార్యక్రమాలకు బ్రాండ్‌గా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు ఓసీల్లోని పేదలకు సైతం మధు ఓ బంధువులా కనిపిస్తారు. అందర్నీ అమ్మ, అయ్య, అక్క, చెల్లీ, మామా అత్త, బాబాయి, పిన్ని, అన్నా తమ్మీ ఇలా వరసులు పెట్టి పిలుస్తూ అందరితో కలిసి మెలసి ఉంటున్నారు. ఊర్లో ఎవరు చనిపోయినా రూ.5 వేల ఆర్థిక సాయం చేస్తారు. పెళ్లిళ్లకు కూడా తనవంతు సాయమందిస్తారు. అమ్మనా న్నల కు వచ్చిన రైతు బంధు, ఫించన్ డబ్బులతో మార్కెట్ ఏర్పా టు చేశారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎవ రౖనా సాయం కోరితే చాలు స్పందించి తనతో పనిచేసే యువతను భాగస్వామ్యం చేస్తూ సాయం చేస్తున్నారు.
బీసీలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యం..
జనాభాలో 58 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజ్యాధికారం ద్వారానే ఆత్మగౌరవం, సామాజిక న్యాయం సాధ్యపడుతుందని నమ్మే నీలం మధు సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో ముదిరాజ్‌లతో పాటు సబ్బండ కులాలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నారు.
12 అడుగుల ఐలమ్మ కాంస్య విగ్రహాం ఏర్పాటు..
తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ స్పూర్తి, పోరాట తెగువను భావి తరాలకు అందించాలని కోరుకునే మధు చిట్కుల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదటి సారిగా 12 అడుగుల కాంస్య విగ్రహా న్ని ఏర్పాటు చేస్తున్నారు. తన స్వంత ఖర్చులతో విగ్రహా ఏర్పాటుకు పూనుకున్నారు. ఒక చాకలి కులంలో పుట్టిన ఆడబిడ్డ నిజాం రజాకార్లు, జమీందార్లు, జాగీర్లకు వ్యతిరే కంగా విరోఛితంగా పోరాడి చరిత్రలో నిలిచిన తెగువ నేటి తరానికి స్పూర్తి దాతగా నిలపాలనే ద్యేయంతో విగ్రహాం ఏర్పాటు చేసినట్లు మధు పేర్కొన్నారు. అంతటి పోరాటం చేసిన చరిత్ర కల్గిన బడుగు,బలహీన వర్గాలు తెగువతో చైతన్యంతో పోరాడితే రాజ్యాధికారం సాధించ వచ్చని నమ్ము తున్నాడు. ఐలమ్మ విగ్రహా ఏర్పాటు, బహిరంగ సభ జరుపు కోవడమనేది బీసీ వర్గాల్లో చైతన్యం నింపడం కోసమేనని చెప్పాడు. ఈ నెల 26న ఎల్లమ్మ గుడి వద్ద నిర్వహించే బహి రంగ సభకు సబ్బండ కులాలకు చెందిన ప్రజలు, బీసీ సం ఘాల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు.
పటాన్చెరు నియోజకవర్గంపై కేంద్రీకరణ..
వార్డు మెంబర్ నుంచి ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎదిగిన నీలం మధు పటాన్చెరు నియోజకవర్గంపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయ కులుగా ముది రాజ్ సంఘం రాష్ట్ర నాయకులుగా ఉన్న మధు పటాన్చెరు, గుమ్మడిదల, జిన్నారం,అమీన్పూర్, ఆర్సీపురం మండ లాల్లోని పలు గ్రామాల్లో సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తూ ప్రజాధరణ పొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పార్టీ విధేయుడుగా పనిచేస్తున్న మధు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెబుతున్నాడు. పార్టీ అవకాశం కల్పిస్తె వచ్చే ఎన్నికల్లో పటాన్చెరు నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నారు. నియోజవకవర్గంలో యువకులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, కార్మికుల మద్దతు పొందుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ త్యాగాలు, పోరాట స్పూర్తితో సామాజిక చైతన్యం పొందిన మధు 'నా పొలం. నా పంటపై నీ పెత్తనమేంటిరా..! అంటూ ఇసు నూరి రామచంద్రారెడ్డిని ఎదిరించి నిలిచిన చిట్యాల ఐలమ్మ గొప్పదనాన్ని, పోరాట పటిమను చాటి చెప్పేందుకు విగ్ర హాం ఏర్పాటు చేసినట్లు పేర్కొంటున్నాడు. సోమవారం జరిగే బహిరంగ సభకు టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. టీఆర్ ఎస్ నాయకుడిగా ప్రజల్లో బలమున్న మధు ఏర్పాటు చేసిన చిట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కావడం, ఐలమ్మను స్మరించే కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని రజకులే కాకుండా బీసీ శ్రేణుల్లోనూ టీఆ ర్ఎస్ కు మరింతఆధరణ పెరుగుతందని మధు పేర్కొంటున్నారు.