Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవ తెలంగాణ-కొండపాక
చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి పంపిణీకి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు టుబిహెచ్కె నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు, ఈడబ్ల్యూఐడిసి, పంచాయతీ రాజ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి ఆయా గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించడంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు కావలసిన మౌలిక వసతులు మరి ఇతర సమస్యలను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అలసత్వం ప్రదర్శించరాదని ఎలాంటి అవరోధాలు ఎదురైన వేగంగా పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆదేశించారు. గహ నిర్మాణాలలో సౌకర్యాలు అన్నింటిని సరిచూసుకొని సిద్ధం చేయాలని, నిర్మాణ ప్రగతిలో ఉన్న ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అనంత రెడ్డి, తహసీల్దార్, నిర్మాణ ఏజెన్సీ అధికారి బాపినీడు, ఈడబ్ల్యూఐడీసీ ఇంజనీర్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.