Authorization
Wed February 19, 2025 06:52:05 am
నవతెలంగాణ-దుబ్బాక
ఉమ్మడి రాష్ట్రంలో మహిళలను ఏ ప్రభుత్వం ఆదరించలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీ ఆర్ఎస్ ప్రభుత్వం ఆడబి డ్డల్ని అన్ని విధాలా ఆదరిస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి అన్నారు. దుబ్బాక పురపాలిక కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో బతుకమ్మ చీరలను మున్సిపల్ చైర్ పర్సన్ వనిత భూమిరెడ్డి శనివారం పంపిణీ చేసి మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల పెళ్ళిళ్లకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. మెప్మా కో ఆర్డినేటర్ రేణుక, రేషన్ డీలర్ సుభాష్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.