Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-సిద్దిపేట
పుష్పాలను పూజించే, ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ పండుగ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీ మున్సిపల్ కౌన్సిలర్ వరాల సురేశ్-కవిత, హానుమాన్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ నాయిని చంద్రం వార్డులో బతుకమ్మ చీరలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ సిద్ధిపేటలో బాగా నిర్వహించుకునే మహిళల పండుగ అని అన్నారు. మీరంతా ఆరోగ్యంగా ఉంటే చాలని, ఇందు కోసం మీ ఇళ్లు పరిశుభ్రంగా నిలపాలని, మిత ఆహారం తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. ఆరోగ్య సిద్ధిపేటలో భాగంగా తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని ప్రజలను కోరారు. అనంతరం పట్టణంలోని మదీనా ఫంక్షన్ హాల్ లో అబ్దుల్ రబ్ ఆరీఫ్ మెడికల్ కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్ ఆధ్వర్యంలో నీట్ విద్యార్థులకు జరిగిన ఏక్స్ పర్ట్ గైడెన్స్ క్యాంపు కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం బీ ఫార్మసీ కళాశాల ప్రారంభం కాబోతున్నదని, రేపు సోమవారం బీఫార్మసీ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏంబీబీఎస్ సీట్లు పెరిగాయని, 70 ఏండ్లలో 800 సీట్లు ఉండేవనీ, కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఏడేండ్లలో 2840 సీట్లు వచ్చాయని తెలిపారు. సిద్ధిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం పీజీ కోర్సుల్లో 50 సీట్లు వచ్చాయని తెలిపారు. సిద్ధిపేటలో ఓ ప్రయివేటు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రెండు ఉన్నాయని, ఇక్కడే ఏంబీబీఏస్ చదువొచ్చునని తెలిపారు. పట్టుదలతో చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఆయా వార్డుల నాయకులు పాల్గొన్నారు.