Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ రూరల్
అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని నిరుద్యోగ యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.కేశురాం హితవు పలికారు. ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 3, గ్రూప్ 4లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతీ యువకులు ఇలాంటి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాలను సంపాదించుకోవాలని, తద్వారా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగ కల్పన కోసం ఇలాంటి శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్టడీ సర్కిళ్ల ద్వారా ఇస్తున్న శిక్షణ తరగతులలో మంచి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోదన చేయడంతో పాటు మంచి స్టడీ మెటీరియల్ అందజేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గణపతి సహాయ వెనుకబడిన అభివద్ధి అధికారి యం. నాగరాజు గౌడ్ అధ్యాపకులు దశరథ్ పాల్గొన్నారు. శిక్షణా తరగతులకు దాదాపు 30 మందికిపైగా విద్యార్థినీ, విద్యార్థులు హాజరైనారు.