Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంపేట
మండల పరిధిలోని తిప్పనగుల్ల గ్రామపంచా యతీ పరిధిలోని వడ్డెర కాలనిలో రోడ్లన్నీ బురదమ యంగా మారడంతో మహిళలు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్డెర కాలనీలో ఇప్పటివరకు ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదని, మోరి కూడా కట్టలేదని కాలనీవాసులు వాపోతు న్నారు. మురికి నీరు నిలువతో విపరీతమైన దోమల బెడద ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శౌకత్ పల్లి, తిప్పనగుళ్ల నుంచి వడ్డెర కాలనీకి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని కాలనీవాసులు పేర్కొన్నారు. రోడ్లు సరిగా లేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగడానికి మంచి నీరు లేక బోర్ బావుల నుంచి తెచ్చుకుంటున్నామన్నారు. బోరు మోటరు కాలిపోయి దాదాపు 6 నెలలు అవుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్‌ను వివరణ కోరగా మంచినీళ్లు మాత్రం భగీరథ నీరు వస్తున్నందున వాటిని వడ్డెర కాలనీవాసులు పొలాలకు మళ్లించుకుంటున్నారన్నారు. వాటర్ ట్యాంక్‌ను కూడా వడ్డెర కాలనీ వాసే శుభ్రం చేస్తున్నాడని సర్పంచ్ తెలిపారు. మొన్నటి వరకు వర్షాలు పడినందున గుంతలలో నీరు నిలిచిన మాట వాస్తవమేనని, మొరం పోయిస్తామని తెలిపారు. శౌకత్ పల్లి నుంచి వడ్డెర కాలనీ వరకు బీటీ రోడ్డు వేయాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. బోరు మోటారు రిపేరుకు ఇచ్చామని బాగు చేసిన తర్వాత వెంటనే మోటర్ బిగిస్తామని తెలిపారు.