Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
- ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభం
నవతెలంగాణ-పటాన్చెరు
విద్యార్థి దశ నుండే విద్యార్థులకు క్రీడల పై ఆసక్తి పెంపొందించేలా చూడాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం విద్యా రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశార న్నారు. బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలన్న సమన్నత లక్ష్యంతో గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్లు ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. క్రీడల పరంగా సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్,ఇస్నాపూర్ సర్పంచ్ బాల మణి శ్రీశైలం, ఎంపీటీసీ సభ్యులు గడ్డం శ్రీశైలం ప్రధానో పాధ్యాయులు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.