Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలి
- ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య
నవతెలంగాణ-జోగిపేట
వికలాంగుల సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలని.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. వికలాంగులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఎన్పీఆర్డీ కాన్సన్పల్లి గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారని, వారిలో కేవలం 4.83 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ కంటే వెనకబడిన వారు వికలాంగులని అన్నారు. వికలాంగుల సాధికారత సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలలోని బ్యాక్‌లాక్ పోస్టులభర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలి డిమాండ్ చేశారు. గడిచిన 8ఎండ్ల కాలంలో 12లక్షల ఆసరా పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ప్రభుత్వం రద్దు చేసిన ఆసరా పింఛన్లను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 15.5కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యల్లో చిక్కుకున్నారనీ ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించిందన్నారు. ప్రతీ నిమిషానికి 11మంది ఆకలితో మరణిస్తున్నారన్నారు. పౌష్ఠిక ఆహారలోపం ప్రజలందరికీ అందించడంలో పాలకులు విఫలం చెందినరని విమర్శిం చారు. వికలాంగులలో 9 శాతం మంది మాత్రమే మాధ్య మిక విద్యా పూర్తి చేస్తున్నారు. 40శాతం లోపు స్కూల్లలో మాత్రమే ర్యాంపులు ఉన్నాయన్నారు. 17శాతం పాఠశా లల్లోనే వికలాంగులు వినియోగించుకునే విధంగా టాయిల ెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రి లో వినికిడి పరీక్షలు నిర్వహించాలన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వికలాంగుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగుల స్టడీ సర్కిల్ ఎర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 6ఎండ్లు అవుతుందని అమలులో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయమ్మ, జిల్లా కార్యదర్శి బస్వారాజు పాటిల్ మాట్లాడుతూ.. 40శాతం వైకల్యం కలిగిన వికలాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులని 2016 చట్టం చెపుతుంటే రాష్ట్రంలో ఆర్టీసీ అధికారులు మాత్రం బదిరులు, మానసిక వికలాంగులు, అంధులకు 100శాతం వైకల్యం ఉంటేనే రాయితీ బస్ పాస్‌లు ఇస్తామని అధికారులు చెప్పడం సరైంది కాదన్నారు. షరతులు లేకుండా వికలాంగులకు ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జరిగే సదరం క్యాంపులో అవకతవకలు జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం వికలాంగులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు
కాన్సన్ పల్లి గ్రామ కమిటీ ఎన్నిక..
ఈ సమావేశంలో ఎన్పీఆర్డీ కాన్సన్పల్లి గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షురాలుగా సాయమ్మ, అధ్యక్షులుగా సత్తయ్య, కార్యదర్శిగా రమాదేవి, కోశాధికారిగా శివలీల, కమిటీ సభ్యులుగా మహేష్, రాములులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి డి. విద్యాసాగర్, ఎన్పీఆర్డీ నాయకులు బస్వరాజ్, సాయమ్మ, రమాదేవి, సత్తయ్య, శివాలీల, మహేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.