Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వివరాలు తీసుకురాకుండా సమావేశాలకు హాజరైన అధికారులు
అధికారులపై తీరుపై సర్వత్రా విమర్శలు
నవతెలంగాణ-జహీరాబాద్
రాష్ట్ర వైద్యా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తమ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి కూడా.. అధికారులు కనీస వివరాల్లేకుండా సమావేశంలో పాల్గొన్నారని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం జహీరాబాద్, మొగుడం పల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్య కమాలను ప్రారంభించిన విషయం విధితమే. అయితే పలు శాఖల అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తు న్నారని.. ఆయన దృష్టికి రావడంతో.. సమావేశ వేధికపైనే విద్యుత్, వ్యవసాయ, ఆరోగ్య శాఖల అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆరోగ్య శాఖ మంత్రి తమ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి కూడా.. ఆ శాఖకు సంబందిచిన అధికారులు కనీస వివరాలు తీసుకురాకుండా సమావేశానికి హాజరు కావడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
వైద్య సేవల వివరాలు, ఆయా పీహెచ్సీలు, కమ్యూ నిటీ వైద్యశాలల నిర్వహణా తీరు.. వాటికి కావాల్సిన సౌకర్యాలు, పరికరాల గురించి మంత్రి దృష్టికి సంబంధిత అధికారులు తీసుకురాకపోవడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. జహీరాబాద్ కమ్యూనిటీ వైద్యశాలలో ఎన్ని సిజేరియన్లు, ఎన్ని నార్మల్ డెలివరీలు, గత నెలలో జరిగిన వాటికి సంబంధించిన వివరాలు కూడా డిసిహెచ్ఎస్, డిఎంహెచ్వోలు వెంబడి తీసుకురాకపోవడాన్ని మంత్రి తప్పుబట్టారు. తాను పర్యటనకు వస్తున్నానన్న విషయం తెలిసి కూడా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగని నిలదీశారు. అలాగే మన్నాపూర్ రైతువేదిక ప్రారంభంలో మంత్రి అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడంతో సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఆయా శాఖల్లో ఉన్న సమస్యలను మంత్రి సభ వేదిక ముందు తెలపడం వాటికి అధికారుల నుంచి సరైన సమాధానం రాకb ోవడంతో తీవ్రంగా మండిపడ్డారు. తొమ్మిదో తరగతి విద్యన భ్యసిస్తు విద్యార్థిని 16,17వ ఎక్కాలకు సంబంధించి సరియైన సమాధానం చెప్పకపోవడంతో సంబంధిత మాథ్స్ టీచర్ సక్రమంగా బోధించడం లేదని, వారే కాకుండా రెసిడెన్షియల్ హాస్టల్లో విద్యను బోధిస్తున్న అధ్యాపకులు అందరూ విద్యార్థులను తమ విద్యార్థులుగా భావించి తమ తమ సబ్జెక్టుల్లో పూర్తి స్థాయిలో నిపుణులుగా తయారు చేయాలని సూచించారు. ఇకముందు తాను బడులు, గుడు లు గ్రామాలు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడి అధికారుల పని విధాన ంపై క్షుణ్ణంగా పరిశీలిస్తానని మంత్రి అధికారులకు చురకలు అంటించారు. కిందిస్థాయి ప్రజాప్రతినిధులతో ఉన్నత హౌదాలో ఉన్న ప్రజా ప్రతినిధులు సంబంధాలను పెంచు కోవాలని హితవు పలికినట్లు తెలిసింది. దీంతో ప్రజా ప్రతిని ధులతో పాటు అధికారుల్లో చలనం ప్రారంభం అయింది.