Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు మహముద్ అలీ, హరీశ్‌రావు
నవతెలంగాణ-మర్కుక్
'తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. నక్సలైట్లు పెరుగుతారని చాలా మంది భావించారు. దాన్ని తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్ పోలీసులకు పెద్దపీట వేసి, శాంతి భద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు' అని హౌం శాఖ మంత్రి ఎండి.మహముద్ అలీ, ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని పోలీసుస్టేషన్లో మర్కుక్ ఎస్ఐ క్వార్టర్స్, సిబ్బంది క్వాటర్స్, ఆఫీసర్స్ గెస్ట్ హౌస్, మహిళా సిబ్బంది విశ్రాంతి బ్యారక్, పోలీస్ సిబ్బంది విశ్రాంతి బారక్, బీడీ టీం బిల్డింగ్, డాగ్ కెనాల్స్ రూమ్స్, ఇంటర్నల్ సీసీరోడ్స్, అత్యాధునిక టెక్నాలజీ యూపీఎస్ సిస్టం ల్యాండ్ స్కేపింగ్, అత్యాధునిక టెక్నాలజీతో రూ.24 కోట్లతో అధునాతన భవనాలను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకష్ణ శర్మ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్,పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐజి, వెస్ట్ జోన్ ఐజి కమలహాసన్ రెడ్డి ఐపీఎస్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎస్పీ చేతన, సర్పంచ్ భాస్కర్, ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, ఎంపీటీసీ సాయి రెడ్డి చైతన్యశంకర్ రెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి చైర్మన్ డిసిసిబి మెదక్, లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ సిద్దిపేట్, గజ్వేల్ గడ అధికారి ముత్యంరెడ్డి, టిఆర్ఎస్ మర్కుక్ మండల పార్టీ అద్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ విజరు కుమార్, ఎస్ఇ తులసి రెడ్డి,ఈఈ శ్రీనివాస్ రావు, డిఈ రాజయ్య, కాంట్రాక్టర్ ప్రసాద్, అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, గజ్వేల్ ఏసిపి రమేష్, గజ్వేల్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి మర్కుక్ ఎస్ఐ హరీష్, ములుగు ఎస్ఐ రంగా కృష్ణ, గౌరారం ఎస్ఐ సంపత్,పోలీసు అధికారులు సిబ్బంది, మర్కుక్ మండలం ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.