Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజు
నవతెలంగాణ-గజ్వేల్
వార్డును సుందీకరణ చేస్తామని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 19 వ వార్డు కౌన్సిలర్ గుంటూకు శిరీష రాజు అన్నారు. గజ్వేల్ నుంచి సంగాపురం ఎడ్యుకేషన్ హబ్ సెంటర్ లైటింగ్ కోసం జరుగుతున్న పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బస్తీలను అభివృద్ధి చేస్తున్నాం. హరితహారం మొక్కలు నాటడంతో వార్డు ఆకుపచ్చగా మారిందన్నారు. గజ్వేల్ వర్గల్ కమాన్ నుంచి ఎడ్యుకేషన్ హబ్ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.1.20 కోట్లతో 100కు పైగా సెంటర్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతర్గత మురికి కాల్వలు నిర్మిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, తెలంగాణ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కృషితో వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.