Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పుల్కల్
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌తో పాటు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి నేడు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మండలానికి వస్తున్నట్టు టిఆర్ఎస్ పార్టీ పుల్కల్ మండలాధ్యక్షులు మాచర్ల విజరు కుమార్ తెలిపారు. పుల్కల్ ఉమ్మడి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ పత్రాలను, షాదీ ముబారక,్ కల్యాణ లక్ష్మి చెక్కులను, బతుకమ్మ చీరల పంపిణీ చేస్తారన్నారు. అలాగే పుల్కల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేస్తారన్నారు. సర్పంచులు , ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.