Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట
వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిటి పాయింట్స్(భూమి నిజనిర్ధారణ)లో భాగంగా చేగుంట మండలం చిన్న శివనూర్ గ్రామంలో జిటి పాయింట్ కోసం రైతు చింతాకుల మహేష్ పత్తి పంటను వ్యవసాయ అధికా రులు సోమవారం పరిశీలించారు. జిటి పాయింట్ శిక్షణ వ్యవసాయ అధికారి యాదగిరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి ఇద్దరు వ్యవసాయ అధికారులను జిటి పాయింట్స్ వెరిఫి కషన్ చేయడానికి నియమించడం జరిగింది. నార్సింగి, నర్సాపూర్ మండలాల వ్యవసాయ అధికారులు ఎంపికయ్యా రు. వీరికి గత నెల 17వ తేదీన హైదరాబాద్లోని ఉద్యానవన శాఖ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. ఈ నెల 23వ తేదీన జూమ్ మీటింగ్ ద్వారా శిక్షణ ఇస్తారు. మనోహరాబాద్, తూప్రాన్, మాసాయిపేట్, చేగుంట మండలాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించి జిటి పాయింట్స్ ను రైతుల వ్యవసా య పొలాల వద్దకు వెళ్లి వారి పత్తి పంటలపై నిర్ధారణ చేశారు. కార్యక్రమంలో మనోహారాబాద్, తూప్రాన్, చేగుం ట, మండలాల వ్యవసాయ అధికారులు రాజశేఖర్ ,గంగ మల్లు, హరిప్రసాద్ గౌడ్, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్, సచిన్ ,అశోక్ రెడ్డి, తెదితరులు పాల్గొన్నారు.