Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ రూరల్
రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 16న నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షలు సజా వుగా జరిగేలా పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో గ్రూప్-1 పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పౖ సంబంధిత అధికారులు కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల లు ప్రధానాచార్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ 16న టీఎస్పిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు జిల్లాలో 3,295 అభ్యర్థులు పరీక్ష రాయడానికి 13 కేంద్రాలను గుర్తించామన్నారు. మెదక్ లో 6 నరసాపూర్ లో 4 తూప్రాన్ లో 3 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో 24 మంది అభ్యర్థులు 48 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాయుటకు వీలుగా రూములను గుర్తించి ఫర్నీచర్ లైట్స్ ఫ్యాన్లు నీటి సౌకర్యం వంటివి ఏర్పాటు చేయాలని ప్రతి గదికి సి.సి. కెమెరాలు అమర్చి చీఫ్ సూపరింటెండెంట్ గదికి అనుసంధానం చేసి మానిటరింగ్ చేయా లన్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో ఉన్న మౌలిక సదుపాయాలతో పాటు సి.సి. కెమెరాల వివరాలు అడిగి తెలుసు కున్నారు. ప్రశ్నా పత్రాలు ఓ.ఏం.ఆర్. షీట్లు కలెక్టరేట్ లోని స్ట్రాంగ్ రూమ్ నుండి కేంద్రాలకు తరలించుటకు రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని అన్నారు. ఆర్.డి.ఓ. లు తమ పరిధిలోని ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను మరొక్క సారి క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి లోటుపాటలకు తావివ ్వకుండా పూర్తి ఈర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని అన్నారు. ప్రతి కేంద్రం వద్ద ప్రాథమిక చికిత్స కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిరంతరాయం విద్యుత్ ఉండేలా చూడాలనిఅభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా బస్సులు నడపాలని అధికారు లకు సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందు వచ్చేలా చూడాలని పరీక్షా కేంద్రాలకు ఎటువంటి గ్యాడ్జెస్ ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించవద్దని కలెక్టర్ సూచించారు. వికలాంగ అభ్యర్థుల కోసం పరీక్షా కేంద్రాలలో ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇస్తామని అన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం పరీక్షా కేంద్రాలలో ఉన్న వసతులను పరిశీలించి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు పార్టీ ఏర్పాట్లు చేయాలని తిరిగి పరీక్షకు ముందు ఒకసారి సమావేశమై ఏర్పాట్లపై సమీక్షిస్తామని కలెక్టర్ హరీష్ తెలిb ారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్ రమేష్ ఆర్డిఓ. లు సాయిరాం వెంకట ఉపేందర్ రెడ్డి డీఈఓ రమేష్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఆర్.టి.సి. డిపో మేనేజర్ రవిచ ందర్ కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్ వివిధ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల ప్రధానాచార్యులు తదితరులు పాల్గొన్నారు.