Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల సాయంతో వెనుదిరిగిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-పుల్కల్
పుల్కల్ మండల పరిధిలోని గోంగులూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్ర మానికి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రత్యేకంగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్ సర్టిఫికెట్లను అందజేశారు. అయితే బీఎస్పీ జిల్లా కోశాధికారి కిరణ్ ఆధ్వర్యంలో దళితు లందరూ కలిసి తమ గ్రామానికి దళిత బంధు పథకం ఎంత మందికి ఇచ్చారని ఎమ్మెల్యేను నిలదీశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన వారు.. ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండి.. దళితులపై పోలీసులతో దాడి చేయిస్తావా అని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ.. దళితబంధు ప్రవేశపెట్టి ఏడాది గడిచినప్పటికీ.. ఇంత వరకూ తమ గ్రామంలో ఏ ఒక్కరికి రాలేదన్నారు. ఈ విష యాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిం చగా ఎలాంటి సమాధానం చెప్పలేక పోలీసుల సాయంతో తమ గ్రామం నుండి వెనుదిరిగి వెళ్లిపోవడం సిగ్గుచేట న్నారు. ఒక దళిత ఎమ్మెల్యే వై ఉండి దళితులపై దాడి చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. దళితబంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలనిడిమాండ్ చేశారు. లేనియెడల దళితు లను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిం చారు. దళితులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.