Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండాపూర్
మండలంలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమా వేశం సోమవారం నిర్వహిం చారు. ఈ సమావేశానికి మండలం లోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీ సీలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలను వ్యవస్థను సరైన దిశలో నడిపే అధికారులు మాత్రం హాజరు కాకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎంపీపీ మనోజ్ రెడ్డి సభకు హాజరైన అధికా రులతో మండలంలో ఉన్న సమస్యలపై చర్చించారు. తొందరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా హాజరుకాని అధికారులపై కలెక్టర్ ఆదేశాలు మేరకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.ఎక్సైజ్ అధికార ులతో గుడుంబా, గంజాయి మరియు నల్ల మందు నిర్మూలన అవగా హన కార్య క్రమం జరిపించారు. 'ఓ యువత మేలుకో.. డ్రగ్స్ మానుకో'.. కలిసిక ట్టుగా డ్రగ్స్ భూతాన్ని తరిమికొడదాం అంటూ సర్పంచ్, ఎంపీటీసీలకు సూచించారు.