Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలు సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతుందని సర్పంచ్ దోరగొల్ల రాములు అన్నారు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్, చిన్న శివనూర్ గ్రామ సర్పంచ్ కొటారి అశోక్, పలు గ్రామాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాల యాల్లో బతుకమ్మ చీరలు మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు , అంగన్వాడి టీచర్, వార్డు సభ్యులు, ముదిరాజ్ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.