Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి
నవతెలంగాణ-నిజాంపేట
మహిళ సంఘాల సభ్యులు బ్యాంక్ లింకేజీతో రుణాలు, స్త్రీ నిధి రుణాలు, మండల సమాఖ్య, గ్రామ సంఘాల నిధులతో 100 కొత్త వ్యాపారాలు నిర్వహించుకునేలా చేశామని మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి తెలిపారు. మండల మహిళా సమాఖ్య ఐదవ సర్వసభ్య సమావేశం మంగళవారం నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన ఏపీఎం వెంకస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎంపీపీ సిద్దిరాములు, ఎంపీటీసీ లహరి, ఎంపీడీఓ వెంకట లక్మిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి మాట్లాడుతూ మహిళలు కొత్త వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రస్తుత సంవత్సరంలో సంఘాల మహిళలు 159 కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయనున్నామని తెలిపారు. మండల సమాఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ప్రగతి పనుల గురించి వివరించారు. 427 సంఘాలకు బ్యాంక్ లింకజ్ లక్ష్యం16 కోట్లు కాగా 337 సంఘాలకు 17 కోట్ల 76 లక్షలు ఇప్పించటం జరిగిందని తెలిపారు. అదే విధంగా 2022-23లో మండల సమాఖ్య చేపట్ట బోయే కార్యక్రమాల గురించి వివరించారు. మహిళ సంఘాలు తయారు చేసిన ఉత్పతులను, మంజీర బ్రాండ్ పేరుతో ఉన్న వస్తువులపై అందరికి అవగాహన కల్పించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి, ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, ఎంపీడీఓ వెంకట లక్మి, స్థానిక ఎంపీటీసీ లహరి, ఏపీఎం వెంకటస్వామి, సీసీలు స్వరూప లక్మి, అకౌంటెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ స్వామి, మండల సమాఖ్య పాలక వర్గం, గ్రామ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.