Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేపై కావాలనే బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు
- కల్యాణ లక్ష్మీ డబ్బులు ఎవరికి ఇవ్వలేదో నిరూపించాలి
- నర్సాపూర్ గడ్డ మదన్ రెడ్డి అడ్డా
- టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చౌటకూరి చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ- చిలిపీచేడ్
మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామ యువకుడిని తిట్టారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, కావాలనే నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సరదాగా దూషించిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వ్యతిరేకిస్తూ బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల అశోక్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మండల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను పక్కనపెట్టి ఊత పదాలను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు. దమ్ముంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం, ముందు ఓటు బ్యాంకు పెంచుకోండి అని చౌటకూరి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కుల మతాలకతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అందిస్తున్నారని మరచి బీజేపీ నాయకులు ఎద్దేవా చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. అజ్జమారిలో జరుగుతున్న అభివృద్ధి చూసి తట్టుకోలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను తన సొంత బిడ్డలతో సమానంగా చూస్తున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డిని బీజేపీ నాయకులు సింగాయపల్లి గోపి అనడం ఎంతవరకు సమంజసమో ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. అజ్జమారి గ్రామంలో ఎవరికి కల్యాణ లక్ష్మి రాలేదో? ఎక్కడ ఏ సమస్య తో ఆగిందో బీజేపీ నాయకులు నిరూపించాలని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద, వైస్ ఎంపీపీ విశ్వంబర్ స్వామి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు లక్ష్మీ దుర్గారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ ఛైర్మన్ రామచంద్రారెడ్డి, సర్పంచ్లు మాంతాప్పా, రాతల శంకర్, గోపాల్ రెడ్డి, కో అప్షన్ షఫీ, మాజీ జిల్లా యువత అధ్యక్షుడు చౌటకూరి చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, మాణిక్య రెడ్డి, ముకుందా రెడ్డి, కిషన్ రెడ్డి, దుర్గారెడ్డి, మాణిక్యం, సయ్యద్ హుస్సేన్, నారగౌడ్, మాణిక్య రెడ్డి ఉన్నారు.