Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ-అమీన్పూర్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకుని భాగస్వాములవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పటేల్ గూడ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఈర్ల నీతిషా శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ చీరల పంపిణీ, పాత పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సాంప్రదా యంగా పండుగలను ఘనంగా నిర్వహించుకుంటున్నా మన్నారు. ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా, ప్రతి ఇంటికి కాలేశ్వరం ద్వారా మంచి నీటిని అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంద న్నారు. అమీన్ పూర్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు ఈర్ల దేవానంద్ ముదిరాజ్, జెడ్పీటీసీ గంగుల సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఈర్ల నీతిషా శ్రీకాంత్ ముదిరాజ్, ఉప సర్పంచ్ జానకి జ్ఞానేశ్వర్, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఎంపీవో సంతోష్, పంచాయతీ సెక్రెటరీ ఉమా మహేశ్వర్, పలువురు సిబ్బంది, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.