Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్
నవతెలంగాణ-హుస్నాబాద్
ఉమ్మడి పాలనలో దెబ్బతిన్న కులవృత్తులను టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి నిలబెడుతోందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. కొన్ని ప్రభుత్వాల విధానాలతో కనుమరుగైన చేతివృత్తులకు జీవం పోస్తున్నట్టు చెప్పారు. మంగళవారం ఆయన హుస్నాబాద్‌లోని చారిత్రక ఎల్లమ్మ చెరువులో చేపపిల్లలను వదిలారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోపాటు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పల్లెలు వెలుగుతున్నాయని చెప్పారు. ఉమ్మడి పాలనలో వత్తులు పోయి, ఉపాధి కరువై ప్రజలు వలసపోయారన్నారు. ఫలితంగా పల్లెలు పాడుబడిపోయి కనిపించేవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పల్లెలను అభివద్ధి చేస్తోందని తెలిపారు. కనుమరుగైన చేతి, కుల వత్తులకు జీవం పోయాలని వివిధ కులాలవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోందన్నారు. నియోజక వర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో గల 134 చెరువుల్లో రూ.63.31 లక్షల విలువైన 47,12000 చేపలను వదిలినట్టు తెలిపారు. హుస్నాబాద్ లోని మూడు చెరువుల్లో 3,93,000 చేపలను వదిలామన్నారు. మత్స్యకారులు, ముదిరాజ్, బెస్త కులాలకు చెందిన వారికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఆయా వర్గాలకు 855 ద్విచక్ర వాహనాలు, 23ఆటోలు , 44 ప్లాస్టిక్ కేట్లు, 96 మందికి వలలు, 2 సంచార వాహనాలు, 2 మహిళా సంఘాలకు 100 శాతం ఉచితంగా రూ.3 లక్షల చొప్పున రూ.6 లక్షల విలువగల గ్రాంట్లు ఇచ్చామని చెప్పారు. గతంలో తాగడానికి నీళ్లు లేని పరిస్థితి నుంచి చెరువుల్లో చేపలు పెంచే స్థితికి వచ్చినట్టు తెలిపారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, మత్స్య శాఖ జిల్లా అధికారి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.