Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినది. గ్రామాలలో చెరువులలో బతుకమ్మలు వేయడానికి బతుకమ్మ మెట్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెట్లు లేకపోవడం ఈ చెరువు నిదర్శనమని గ్రామస్తులు పేర్కొన్నారు. చెరువు కట్టలపై బతుకమ్మ మెట్లుకట్టించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు కానీ పాలకులుగాని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. మహిళలు బతుకమ్మ ఆటపాటలతో ఆడుతూ బతుకమ్మలను చెరువులో వేయడానికి మెట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని చెరువు కట్టలపై పూర్తిగా ముళ్ళ పొదలు ఉన్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజాంపేట మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో బతుకమ్మ మెట్లు కట్టలేదని పలువురు విమర్శిస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వందల కోట్లు ఖర్చు పెట్టి చెరువుకుంటలను బాగు చేసుకోవాలని పదే పదే చెప్పినప్పటికీ కొందరు సర్పంచులు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి బతుకమ్మలు వేయడానికి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.