Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్, మనోహరాబాద్
మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు బుధవారం రోజుతూప్రాన్ లోని పెద్ద చెరువులో 3 లక్షల 90 చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తూప్రాన్ మనోహరాబాద్ మండలా లలోని అన్ని చెరువులలో రాబోయే రోజులలో 50 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. తూప్రాన్ మనోహరాబాద్ మండలంలోని అన్ని చెరువులలో చేప పిల్లలను వదలడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలన్న ఉద్దేశంతో, ఉచిత చేపపిల్లలను సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణా రాష్ట్రంలోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపడానికి, మరియు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. మత్స్య శాఖ కార్మికులు గతంలో ఎన్నో కష్టాలను అనుభవించేవారని, కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలోమత్స్య కార్మికుల కష్టాలు తీరాయని వారు ఆర్థికంగా ఎదిగారన్నారు.డబ్బులు పెట్టి చేపపిల్లలను పెంచే స్తోమత లేని వారికి వంద శాతం సబ్సిడీ ఇచ్చిమత్స్య కార్మికుల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు, గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెలను పంపిణీ చేసిన ప్రభుత్వం, గంగపుత్రుల ముదిరాజులు (మత్స్యకారుల) కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏట 100 కోట్ల 100% సబ్సిడీతో చేపల పెంపకానికి అన్ని రకాల సహాయ సహకారాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తున్నారు, గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి భరోసాను మత్స్యకారులకు భరోసా కల్పిస్తున్నారు. చేపల పెంపకాన్ని వదిలి ఏదో ఒక కూలీ పని చేస్తూ బతుకునీడుస్తున్న మత్స్యకారుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ తిరిగి వెలుగులు నింపారు అని అన్నారు ఇందులో భాగంగా గత ఐదేండ్లుగా మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులు సక్సెస్ కావడం, చెరువుల్లో నీరు నిండుతుండడంతో చేపల పెంపకానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు దఫాల్లో చేపల పెంపకం పూర్తి కావడంతో సంబంధిత చేపలను విక్రయించిన మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగు మల్ల ఎలక్షన్ రెడ్డి ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల్ మైపాల్ రెడ్డి తూప్రాన్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కావేరి గారి భగవాన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, ఫిషరీస్ డైరెక్టర్ గడప దేవేందర్ తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు నాయకులు మన శ్రీనివాస్లతోపాటు అధిక సంఖ్యలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.