Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్
- రైతుల భూములను పరిశీలించిన ఎమ్మెల్యే
- న్యాయం చేయాలని రైతుల వినతి
నవతెలంగాణ-నర్సాపూర్
రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు వల్ల పేద రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ అన్నారు. బుధవారం రెడ్డిపల్లి గ్రామంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అంజనేయులు గౌడ్ రైతులతో కలిసి ఎమ్మెల్యేకు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం బడా నాయకులకు మేలు జరిగే విధంగా రింగ్ రోడ్డు నక్షను మార్చారని వారు ఆవేదన వ్యక్తం రెడ్డిపల్లి గ్రామంలో మొదటగా కాలేశ్వరం ప్రాజెక్టుకు అధిక భూములు కోల్పోయామని కరెంట్ హైటెన్షన్ వైర్లు లకు భూములు కోల్పోయామని, కొండపోచమ్మ కాలువ మా ఊరు నుంచి వెళ్తుండడం వల్ల భూములు కోల్పోతున్నామని ప్రస్తుతం ఇప్పుడు రింగ్ రోడ్డు మూలంగా పూర్తిస్థాయిలో భూమిని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిబులర్ రోడ్డు కోసం రెడ్డిపల్లి మీదుగా భూసేకరణకు అధికారులు మొదట అలైన్ మెంట్ ప్రతిపాదించారని, కొంతమంది నాయకుల భూములు కాపాడేందుకు అలైన్మెంట్ను మార్పు చేసి, కొత్తగా తయారు చేయడంతో రెడ్డిపల్లికి చెందిన చెరువు సగం పోతుందని, గ్రామానికి చెందిన సుమారు వంద మంది పేద రైతుల భూములు రోడ్డు నిర్మాణం కోసం కోల్పోయే ప్రమాదం ఉంద న్నారు. మొదటి అలైన్మెంట్ ప్రకారమే భూసే కరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ను కోరారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించి రెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి రైతులు కోల్పోతున్న భూములను చెరువును సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామం నుంచి రీజినల్ రింగ్ రోడ్ వల్ల రైతుల అధికంగా భూములు కోల్పోతున్నారని పేర్కొంటూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అవసరమైతే ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే మదన్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భూములు కోల్పోయిన రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.