Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
దివంగత వైఎస్ఆర్ కూతురు వైఎస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సరికాదని వైఎస్సార్ టీపీ రాష్ట్ర అబ్జర్వర్ వేణు అన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి పక్కా టీఆర్ఎస్ కోవర్టు అని ఆరోపించారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం చేపట్టి 2300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేస్తుందన్నారు. కాగా ఆమెను బీజేపీ బాణంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభివర్ణించడం హేయనీ యమన్నారు. పూటకో పార్టీ మారుతూ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంజీవరావు మాట్లాడుతూ.. వైయస్సార్ సుపరిపాలన కోసం వైఎస్ షర్మిలమ్మ పాదయాత్ర చేస్తున్నదన్నారు. ప్రతి ఇంటికి గడపకు గడప గడపకూ తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటుం దన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందన్నారు. అందులో నియోజకవర్గంలో పాదయాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 30వ తేదీన అందోల్ మండలం అల్మయిపేట గ్రామానికి పాదయాత్ర చేరుకుంటుందని, అందోల్ గ్రామంలో మధ్యాహ్నం లంచ్, జోగిపేటలో పబ్లిక్ మీటింగ్ ఉంటుందని, రాత్రికి అన్నాసాగర్ లో బస చేసి, మరుసటి రోజు మెదక్ జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. సభను పెద్ద ఎత్తున హాజరై విజయ వంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు నరేష్, సంగన్న, సాయిలు, సునీల్, రవి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.