Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
ఆందోల్ జోగిపేట మున్సిపాల్టీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులైన లబ్ధిదారులకే ఇవ్వాలని, ఇండ్ల ఎంపిక పారదర్శకంగా నిర్వహించి పేదలకు న్యాయం చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి డి. విద్యాసాగర్ అన్నారు. బుధవారం జోగిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం లబ్ధిదారుల దరఖా స్తులను తహసిల్దార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇల్లు, భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ లో ఎంపిక లో నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇవ్వాలన్నారు. భూమి లేని ఇల్లు లేని నిరుపేదలు అనేకమంది చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారని వారిని ఆదుక ోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని పైన ఉందని అన్నారు. ఎంపిక లో అధికారులు పారదర్శంగా వ్యవహరించాలన్నారు. నిర్మా ణాలు పూర్తి అయిన వాటిని తక్షణమే ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు లక్ష్మి, లచ్చమ్మ, సామంత, సాదర బేగం, వీరమని, పెంటమ్మ, లత, మంజుల, మహేష్ తదితరులు పాల్గొన్నారు.