Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య
- కరపత్రం విడుదల
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
కాంట్రాక్టు కార్మికులందరికీ వెంటనే బోనస్ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే.రాజయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖాజీపల్లి టీఐడీసీ పరిశ్రమ వద్ద బుధ వారం కరపత్రం విడుదల చేశారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. బోనస్ చట్టం 1965 ప్రకారం కార్మికుల ందరికీ తప్పకుండా బోనస్ చెల్లించాలన్నారు. బోనస్ చెల్లించని పరిశ్రమల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరిం చారు. బొల్లారం, కాజిపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో పరిశ్రమ యాజమాన్యానికి లాభాల మీద ఉన్న ప్రేమ కార్మికుల సంక్షేమం మీద, కానీ కార్మిక చట్టాలు అమలులో కానీ లేదన్నారు. బోనస్ చట్టం 1965 ప్రకారం ఓ కార్మికుడు సంవత్సరములో 30 రోజులు పని చేస్తే బోనస్‌కు అర్హుడన్నారు. చాలా కంపెనీలు బోనస వ్వకుండా ఎగ్గొట్టడం దుర్మార్గమన్నారు. బోనస్ ఇవ్వడానికి పరిశ్రమ లాభ నష్టాలతో సంబంధం లేదన్నారు. బోనస్ సీలింగును రూ.21 వేలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు మరియు క్యాజువల్ కార్మికులందరికీ బోనస్ చెల్లించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తావున్నారు. ఏవైనా కంపెనీ యాజమాన్యాలు బోనస్ చెల్లించ కపోతే 9490098701కు సమాచారం ఇవ్వాలన్నారు. జిన్నారం క్లస్టర్ నాయకులు భాస్కర్ రెడ్డి, చంద్రశేఖరు, శ్రీనివాసు, మహేష్, సత్యం ,తదితరులు పాల్గొన్నారు.