Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
పార్టీలకు అతీతంగా వార్డును అభివృద్ది చేసుకుం దామని జోగిపేట మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ రంగ సురేష్ అన్నారు. బుధవారం వాసవి కల్యాణ మండపంలో 13వ వార్డు వేల్ఫేర్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవ ంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకుర ావాలని సూచించారు. వార్డులో ఏవరైనా చనిపోతే అంత్యక్రి యలకు సొంతంగా రూ.2500లను వేల్పేర్ కమిటీ ద్వారా అందజేస్తానని హామీనిచ్చారు. వేల్ఫేర్ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగ హరి, రాజులు మాట్లాడుతూ.. వార్డులో నెలకొన్న సమస్యలతో పాటు అభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలను చేయాలన్నారు. సమస్యలను తెలియజేసేందుకు వాట్సఫ్ గ్రూపును ఏర్పాటు చేశావున్నారు. వేల్ఫేర్ కమిటీకి రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవని వారు స్పష్టం చేశారు. మాజీ ఎంపీటీసీ ఆకుల శంకర్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు మురళీ, నాయకులు ఆకుల కృష్ణ, సోమేశ్వర్, ఆకుల విఠల్, శ్రీశైలం, రాజేశ్వర్, ప్రసాద్, నసీర్, సత్యం, రమేష్ తదితరులు ఉన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
13వ వార్డు వేల్ఫేర్ కమిటీ అధ్యక్షుడిగా రంగ హరి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా రాజు, కోశాధికారిగా గజ్వాడ రాజు, ఉపాధ్యక్షులుగా శంకర్, సోమేశ్వర్, యాదగిరి, సత్యం, జాయింట్ సెక్రటరీ విఠల్, సతీష్, సలహాదారులుగా ఆకుల కృష్ణ, మురళీ, అనిల్ బాబు, మహేష్, అశోక్, యూత్ కమిటీ అధ్యక్షుడిగా అభిలాష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీశైలం, కొశాధికారిగా పవన్ తదితరులను ఎన్నుకున్నారు.