Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ - సిద్దిపేట
పేద ప్రజలు బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం బస్తీ దవాఖానాను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు వైద్య సహాయం అందించేందుకు పలు వార్డుల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, డీఎంఆండ్‌హెచ్‌వో డాక్టర్ కాశీనాథ్, వార్డు కౌన్సిలర్ తాడూరి సాయి తదితరులు పాల్గొన్నారు.