Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -పాపన్నపేట
రాజకీయ పరిణామాలు నేపథ్యంతో పాటు ఇచ్చిన మాట కోసం రాజీనామా చేస్తున్నట్లు పాపన్నపేట పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురు వారం పాపన్నపేట మంజీరా ఫంక్షన్ హాల్లో జరిగిన పీఏసీఎస్ మహాజనసభ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన తన రాజీనామా పత్రంపై సంత కం చేసి సంఘం సభ్యుల సమక్షంలో తోటి డైరెక్టర్లకు అందజేశారు. ఈ మేరకు జిల్లా కో-ఆపరేటివ్ అధికారికి రాజీనామా పత్రం ఇవ్వనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్లుగా రాజకీయం చేస్తూ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, మూడుసార్లు సొసైటీ చైర్మన్ గా పనిచేశానన్నారు. రాజకీయాల్లో పదవుల కన్నా ఇచ్చిన మాటకే కట్టుబడి ఉండటం తన నైజం అన్నారు. లోగడ ఇచ్చిన మాట, రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సొసైటీ అభివృద్ధికి ఇప్పటికే చాలా కృషి చేశానని, మిగిలిన కాలంలో డైరెక్టర్‌గా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఆయన కుమారుడు మాజీ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మాటకోసం ఎంతటి పదవినైనా త్యాగం చేయడానికి సిద్ధమేనన్నారు. ఏడుపాయల చైర్మెన్ బాలాగౌడ్ మాట్లాడుతూ కేవలం 150 మంది సభ్యులు ఉన్న సొసైటీని 2500 సభ్యులకు పెంచిన ఘనత మోహన్ రెడ్డిదేనని అన్నారు. ఒకప్పుడు కిరాయి గదిలో ఉన్న సొసైటీకి నేడు రెండు అంతస్తుల భవనాన్ని కట్టించడంలో ఆయన సేవ అమోఘమన్నారు. దీంతో కొంతమంది రైతులు మోహన్ రెడ్డి రాజీనామా చేయొద్దని సొసైటీని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఆయన సేవలు మరింత అవసరమన్నారు. ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలా గౌడ్, స్థానిక సర్పంచ్ గురుమూర్తి గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశం, కోఆప్షన్ సభ్యులు గౌస్, డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ పరిధిలో రైతులు పాల్గొన్నారు.