Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మదన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సాపూర్
నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఎమ్మేల్యే మదన్ రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో నిర్మించ తలపెట్టిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మండలంలో త్రాగునీటికి ఇబ్బందులు రావోద్దనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ నీళ్లు అందించడమే కాకుండా ప్రతి నిత్యం గ్రామ పంచాయతీ రక్షిత మంచినీటి సరఫరా చేయించడం జరుగుతుందన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డికి సర్పంచ్ పెంజర్ల శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ చంద్రాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, ఉపసర్పంచ్ వంచ శోభ, మాజీ సర్పంచ్ తాటి కిష్టయ్య, ఉప్పునూతల సత్యనారా యణ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప్పునూతల వెంకటేశ్ గౌడ్, బోల్ల సదానందం, శివరాజ్, డప్పు నర్సింలు, చిట్టబోయిన మహేందర్, చిట్టబోయిన దుబ్బయ్య, చిట్టబోయిన కుమార్, శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.