Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ సంబరాలు పాల్గొన్న విద్యార్థులు
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో హౌరెత్తించారు. కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ వి,పి రాజు బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇందూర్లో ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ పండుగలను విద్యార్థులు సంతోషంతో నిర్వహించుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూల బతుకమ్మలను తయారు చేశారు. కోలాటం ఆడుతూ సందడి చేశారు. ఆధునిక వస్త్రధారణపై మక్కువ చూపే యువతులు సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు. మహిళా సిబ్బంది కూడా విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాదయ్య, పిఆర్వో రఘు, సిబ్బంది డిపి రావు, డాక్టర్ మల్లేశం, పోచయ్య, ఎల్ ఎన్ రావు, ఎస్ శ్రీనివాస్, పాండురంగం, సరస్వతి, టి బెనర్జీ, హిమబిందు, రేణుక, భవాని పాల్గొన్నారు.