Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజాధనం లూటీ
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య
నవతెలంగాణ-గజ్వేల్
మున్సిపల్ పరిధిలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు కాంటాట్రాక్టర్లు ఇష్టారా జ్యంగా చేస్తూ పప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ఆరోపించారు. గురువారం అండర్ డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు. రోడ్డు మధ్యన, ప్రక్కలలో గుంతలను పూర్తిస్థాయిలో పూడ్చకుండా, సిమెంటు కాంక్రీట్ పనులు నిర్వహించకుండా తమకు సంబంధం లేదంటూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వాసవి నగర్ లో కాంట్రాక్టర్, సూపర్వైజర్తో మొత్తం గుంతను పూడ్చాలని కోరినా మాకు సంబంధం లేదంటూ మేము చేయమంటూ కాంట్రాక్టర్, సూపర్వైజర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా కాంట్రాక్టర్లకు మద్దతునిస్తుందని ఆరోపించారు. పనులు నత్తనడక సాగేలా టెండర్లు రెండు మూడు దఫాలుగా చేసుకుంటూ ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని, కాలయాపన చేయకుండా పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం దిగ్బంధిస్తామని హెచ్చరించారు.