Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రతీ ఇంటికి ఎలాంటి అంతరాయం లేకుండా మిషన్ భగీరథ తాగునీరు అందా లని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం తన చాంబర్లో మిషన్ భగీరథ అధికారులు, సంగారెడ్డి, సదాశి వపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీర్లతో మిషన్ భగీరథ నీటి సరఫరా పై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజార్శి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫ రా కావాలని సంబంధిత అధికారులకు సూచించా రు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో విలీ నమైన గ్రామాలలో మిషన్ భగీరథ నీటి సరఫరా పై ఆరా తీసారు. విలీన గ్రామాల ప్రజలకు, నూతన కాలనీవాసులకు మిషన్ భగీరథ నీరు క్రమం తప్పకుండా అందేలా చూడా లన్నారు. ఎక్కడైనా నల్లాలు పైపులైన్లు మరమ్మతులు ఉంటే వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. సంగారెడ్డి మున్సి పాల్టీలో ఇఎల్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని, అట్టి ట్యాంక్ పనులు త్వరితగతిన పూర్తి చేసి సంగారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైన పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, సంబంధిత కాలనీలకు పూర్తి స్థాయిలో నీరంది ంచాలని సూచించారు. మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్, ఈఈ, డిఈ, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ, డీఈ, మున్సిపల్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.