Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెట్టింపు ధరకు విక్రయాలు
- సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-పుల్కల్
పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు వద్ద మద్యం ఏరులై పారుతోంది. ప్రాజెక్ట్ వద్ద కొందరు సిండికేట్ వ్యాపారులు చట్టవిరుద్ధంగా బెల్టుషాపులను నిర్వహించడమే కాకుండా రెట్టింపు ధరలకు విక్రయించి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతి పెద్దదైన సింగూరు నిండుకుండలా మారడంతో ప్రాజెక్ట్ను చేసేందుకు పర్యా టకుల తాకిడి పెరిగింది. సంగారెడ్డి నుంచే కాక పలు జిల్లాల నుంచి ఈ ప్రాజెక్ట్ను చూడడానికి వస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు సిండికేట్గా మారి ప్రాజెక్ట్ వద్దే మద్యాన్ని విక్రయిస్తున్నారు. డబుల్ రేట్లకు మద్యాన్ని విక్రయించి దర్జాగా వ్యాపారం సాగిస్తు న్నారు. దీంతో కొందరు బహిరంగంగానే మద్యం సేవిస్తూ.. ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మహిళా పర్యాట కులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద ఇంత బహిరంగంగా మద్యం విక్రయాలు జరుపుతున్న యజమా నులపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికా రులు స్పందించి ప్రాజెక్టు వద్ద బెల్టుషాపులను తొలగించా లంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.