Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -పటాన్చెరు
ఆరోగ్యకరమైన జీవనశైలితో చాలా వ్యాధులు మన దరి చేరకుండా నివారించవచ్చని, ఉన్నంత కాలం సంతోషకర జీవనం గడపొచ్చని హైదరాబాద్‌లోని ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హద్రోగ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ టి.సదానందెడ్డి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో 'ప్రతి గుండె కోసం హదయ పూర్వకంగా స్పందించండిలి అనే ఇతివత్తంతో గురువారం నిర్వహించిన 'ప్రపంచ హద్రోగ దినోత్సవం'( వరల్డ్ హార్ట్ డే )లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా కార్డియోవాస్క్యులార్ డిసీజ్‌తో ప్రతియేటా 18.6 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని, మనదేశంలో 40 నుంచి 50 లక్షల మంది ఈ బారిన పడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీటి బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, గుండె జబ్బులు, నివారణ పద్ధతులను ఆయన వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి - అంటే ఇష్టంతో పని చేయడం, ఏడు గంటల నాణ్యమైన నిద్ర, చురుకుగా ఉండడం, మంచి అలవాట్లు, యోగా, ధాన్య సాధన, ఒత్తిడిని అధిగమించడం, ధూమ / మద్య పానాలను మానేయడం, పండ్లు, డ్రైఫ్రూట్స్, తాజా కూరలను ఆరగించ డం వంటివి చేయాలని సూచించారు. అవసరమైనంత మేరకే ఆహారాన్ని భుజించాలని, మొబైల్ ఫోన్లు, కార్లు లేదా మోటారు సైకిళ్ళను వీలయినంత తక్కువగా వాడాలన్నారు. ఛాతీలో నొప్పిగా లేదా అసౌకర్యంగా ఉండి అది క్రమేణా విస్తరిస్తున్నా, కడుపు ఉబ్బరం, ఆందోళన, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించినా.. వీలయినంత త్వరగా ఆస్పత్రికి వెళ్లాలన్నా. సహజ సిద్ధంగా పనిచేసే గుండె ఒకసారి ఆగినా, లేదా దానికి తీవ్ర నష్టం జరిగినా, దానిని సరిచేయడం ఎవరి తరం కాదన్నారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబు లిచ్చి ఆకట్టుకున్నారు. తొలుత ఫార్మశీ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ స్వాగతోపన్యాసం చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ బారిక్ వందన సమర్పణ చేశారు. విశిష్ట ప్రొఫెసర్ డాక్టర్ జీఏ రామారావు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.