Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంగ్టి
మడలకేంద్రమైన కంగ్టిలో ఎంపీపీ సంగీతవెంకట్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. కొన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతి నిదులు రాకపోవడంతో సమావేశంతో కొన్ని అంశాలపైన మాత్రమే చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లా డుతుండగా.. మనఊరు-మనబడి కార్యక్రమంలో జరుగు తున్న పనులు మద్యాంతరంగా ఎందుకు ఆగిపోయయాని దెగుల్వాడి ఎంపీటీసీ ప్రశ్నించారు. మండల కేకంద్రానికి నారాయణఖేడ్ నుంచి సాయంత్రం 5 గంటల తరువాత బస్సుల్లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నా రని.. అలాగే కంగ్టి మీదుగా హైదరాబాద్కు ఉదయం పూట బస్సులు నడపాలని కొందరు సభ్యులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపట్టిన సంక్షేమపథకాలు ప్రతిఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా అధికారులు, నాయకులు చూడాలనిఅన్నారు. కంగ్టి నుంచి హైదరాబాదుకు, ఖేడ్ నుంచి కంగ్టికి రెండు బస్సులను నూతనంగా ప్రారంభించాలని సభ ద్వారా తీర్మానం చేయించారు. పండుగ సమయం కావడంతో నీటి ఇబ్బంది రాకుండ చూడాలని అధికారులక సూచించారరు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ సురేఖా పాటిల్, ఎంపీడీఓ ముజఫరోధ్ధీన్, ఎంఈఓ శంకర్, ఏపీఎం బసవరాజ్, ఏపీఓ ధన్ రాజ్, ఎంపీటీసిలు, సర్పంచులు పాల్గొన్నారు.