Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగదేవపూర్
మండలం పరిధిలోని బిజీ వెంకటాపూర్లో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరు స్నేహాభావంతో మెలగాలన్నారు. గ్రామం మొత్తం ఒక కుటుంబం మాదిరిగా ఉండాలన్నారు. కుల మత బేధాలు పాటించొద్దన్నారు. సర్పంచ్ మంజుల రమేష్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధిపరమేశ్వర్ ముదిరాజ్, వెంకటేష్, సోషల్ మీడియా కన్వీనర్ బాలు, పోలీస్ సిబ్బంది భాస్కర్ పాల్గొన్నారు.